ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏపీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం.