హైదరాబాద్‌లో మరో ఐటీ ఉద్యోగాల మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లోని 'NSN ఇన్ఫోటెక్' పేరుతో నకిలీ కంపెనీని స్థాపించి, 400 మంది నిరుద్యోగుల నుంచి శిక్షణ, ఉద్యోగం పేరుతో రూ. 10-12 కోట్లు వసూలు చేసి బోర్దు తిప్పేశారు. దాని డైరెక్టర్ స్వామినాయుడు కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి మోసాలు జరిగాయి. నిరుద్యోగులను నిలువునా ముంచేస్తూ.. వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్నారు.