Hyderabad Weather Updates: వినయక నవరాత్రుల సమయంలో పూర్తిగా రెస్ట్ తీసుకున్న వరుణుడు.. గణేషుడు గంగ ఒడికి చేరుకున్న తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజృంభిస్తున్నాడు. శుక్రవారం (సెప్టెంబర్ 20న) రాత్రి ఒక్కసారిగా తన ప్రతాపం చూపించాడు. ఇన్ని రోజులు దాచుకున్న వర్షాన్ని మొత్తం ఒక్కసారిగా నగరంలో కుమ్మరించారు. ఈ భయంకరమైన వర్షంతో.. నగరం ఒక్కసారిగా అతలాకుతలమైంది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎప్పటిలాగే చెరువులను తలపించింది.