Hyderabad Biggest Gated Community: హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుక్కునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. సొంతూళ్లలో ఇల్లు ఉన్నా లేకున్నా.. ఉద్యోగం చేస్తున్న చోట చిన్నదో పెద్దదో ఓ ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. నగరంలో ఇండ్ల కొనుగోళ్లు, అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. మార్కెట్‌లో పెరిగిపోయిన డిమాండ్ దృష్ట్యా.. రియల్ ఎస్టెట్ వ్యాపారులు, బిల్డర్లు కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థ అయిన మైహోమ్.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభిస్తోంది.