హైదరాబాద్‌లో సొంతింటి కల నిజం చేసుకునే వారికి గుడ్‌న్యూస్. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకే ఇండ్లు సొంతం చేసుకోవచ్చు. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువకు ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్ బండ్లగూడలో 159, పోచారంలో 601 ఫ్లాట్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. చ.అ. రూ. 4,000-6,000 ఉన్న బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే, ఇవి కేవలం రూ. 2,500-3,000కే లభిస్తున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..