డ్రగ్స్‌విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కడకక్కడ డ్రగ్స్ ముఠాల ఆటకట్టిస్తున్నాయి. అయినా సరే వారికి కంటబడకుండా కొందరు నగరంలోకి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. ఇక, గంజాయి చాక్లెట్టగా అమ్ముతున్నారు.