హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్. మూడు రోజుల పాటు.. నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని పోలీసులు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో గణేష్ ఉత్సవాలు మొదలవనున్న నేపథ్యంలో.. నగరవ్యాప్తంగానే కాకుండా.. పక్క జిల్లాలకు కూడా హైదరాబాద్‌లోని దూల్ పేట నుంచే విగ్రహాలు తరలివెళ్లనున్నాయి. ఈ క్రమంలోనే.. దూల్ పేట మార్గాల్లో 7వ తేదీ రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్టు పోలీసులు తెలిపారు.