Gachibowli Flyover: హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రద్దీగా ఉండే మార్గాల్లో వాహనదారుల సౌకర్యార్థం.. ఫ్లైఓవర్లను నియమిస్తోంది. ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. గచ్చిబౌలి ప్రాంతంలో శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ లెవల్-2 పనులను అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో.. 5 రోజుల పాటు శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్‌ను అధికారులు మూసేయనున్నారు.