హైదరాబాద్ వాసులకు దసరా సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించిన వాటర్ బోర్డు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న.. బకాయిలను చెల్లించేందుకు మరోసారి వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది వాటర్ బోర్డు. దసరాను పురస్కరించుకుని అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని నెల రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. ఈమేరకు పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.