హైదరాబాద్ మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన అంబర్‌పేట–మూసారాంబాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేశారు. మూసీ వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం లేకుండా బ్రిడ్జిని నిర్మించారు. 2023లో నిలిచిపోయిన ప్రతిపాదనకు 2024లో మళ్లీ పనులు ప్రారంభమై.. తాజాగా నిర్మాణం పూర్తయింది.