హైదరాబాద్ శివారులోని కోహెడలో 178 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ తాజాగా రెడ్డి ఆమోదం తెలిపారు. సుమారు రూ.1,901 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ మార్కెట్ కోసం కొత్త డీపీఆర్ రూపకల్పనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టు కార్యాచరణను వేగవంతం చేస్తూ.. అధునాతన వసతులతో మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.