హైదరాబాద్ శివారులో కుండపోత వర్షం.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. అక్కడ 13సెం.మీ వర్షం..

11 months ago 13
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నేడు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరి, అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. కేవలం మూడున్నర గంటల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై, పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Read Entire Article