సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి ఐటీ దిగ్గజ కంపెనీలు క్యూకడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ను సాఫ్ట్ వేర్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే హైటెక్ సిటీ ఉండగా.. అదే తరహాలో నగర శివార్లలో మరో రెండు కొత్త ఐటీ పార్కులు నిర్వహించనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో.. ఐటీ రంగం మరో స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.