హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ) కీలకంగా మారుతుందని రేవంత్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. నగర విస్తరణ కూడా ఎక్కువగా అటువైపే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు మెుదలుపెట్టింది. 21 గ్రామాల మీదుగా 40 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా ఆ రహదారిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.