Rain Alert In Hyderabad: హైదరాబాద్‌లో సోమవారం కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే 100కు డయల్ చేయాలని పోలీసులు సూచించారు. ఇది క్లౌడ్ బరస్ట్ తరహా వర్షమని నగరవాసులు అభిప్రాయపడ్డారు.