రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే మూడు మెగా డిపోల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దీనికి 300 ఎకరాల భూమి అవసరం. చర్లపల్లిలో వందేభారత్ రైళ్లకు ప్రత్యేక డిపో, జూకల్, పాకాలలో కోచింగ్ డిపోలు, వరంగల్-మహబూబాబాద్‌ల మధ్య రూ.908.15 కోట్లతో ఫ్రైట్ డిపో ఏర్పాటు చేయనున్నారు. ఈ డిపోలతో రైల్వే సేవలు మరింత మెరుగుపడతాయి.