National highway Emergency Helpline Number: జాతీయ రహదారుల మీద ప్రయాణిస్తున్నారా.. అయితే ఎప్పుడైనా ఆరెంజ్ కలర్ బాక్స్ గమనించారా.. హైవేల మీద ప్రయాణం సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించేందుకు ఈ ఎస్‌వోఎస్ భాక్సులు ఉపయోగపడతాయి. అలాగే హైవేలపై ప్రయాణించే సమయంలో అత్యవసర సహాయం కావాలంటే 1033 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.