హోలీ పండుగ సందర్భంగా చర్లపల్లి నుండి ఒడిశాలోని భువనేశ్వర్‌కు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రైన్ నంబర్ 0840 మార్చి 18 మరియు 25 తేదీలలో చర్లపల్లి నుండి భువనేశ్వర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఉదయం 9:50 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.