హైదరాబాద్‌లో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా హోలీ వేడుకల్లో పాల్గొని రంగుల్లో మునిగి తేలుతున్నారు. అయితే.. హోలీ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించి యువత ఎంజాయ్ చేశారు. కాగా.. దూల్ పేటలో నిర్వహించిన హోలీ వేడుకల్లో... గంజాయి వినియోగం ఇప్పుడు కలకలం రేపుతోంది. కుల్ఫీ ఐస్ క్రీంలో గంజాయిని మిక్స్ చేసి వేడుకల్లో విచ్చలవిడిగా అమ్మేస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేసింది.